కరోనా నెగెటివ్ : హఫీజ్ కు గ్రీన్ సిగ్నల్...

కరోనా నెగెటివ్ : హఫీజ్ కు గ్రీన్ సిగ్నల్...

కరోనా టెస్టుల్లో రెండుసార్లు నెగెటివ్ వచ్చిన తర్వాత పాక్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్‌తో సహా ఆరుగురు పాకిస్తాన్ క్రికెటర్లకు ఇంగ్లాండ్ లోని జట్టులో చేరడానికి అనుమతి లభించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. హఫీజ్‌తో పాటుగా ఫఖర్ జమాన్, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్ మరియు వహాబ్ రియాజ్ లకు గత మూడు రోజుల్లో రెండుసార్లు కరోనా నెగెటివ్ రావడంతో ఇంగ్లాండ్ లో ఉన్న పాకిస్థాన్ జట్టులో చేరనున్నారు. ఇక ప్రస్తుతం వారి ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన పీసీబీ త్వరలోనే వారు బయలుదేరే వివరాలు తెలుపుతాము అని చెప్పింది. ఇక మరో నలుగురు ఆటగాళ్ళు - కాశీఫ్ భట్టి, హరిస్ రౌఫ్, హైదర్ అలీ మరియు ఇమ్రాన్ ఖాన్ లకు రెండవసారి పాజిటివ్ కూడా పాజిటివ్ వచ్చింది. అయితే పాకిస్తాన్ ఆగస్టు-సెప్టెంబరులో ఇంగ్లాడ్ లో మూడు టెస్ట్, టీ 20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది.