కరోనా నియమాలని ఉల్లంఘించిన పాక్ క్రికెటర్...

కరోనా నియమాలని ఉల్లంఘించిన పాక్ క్రికెటర్...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్  విజయం సాధించింది. ఇక ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్ మొదలుకాకముందే పాకిస్థాన్ కు ఎదురు బెబ్బ తగిలింది. అదేంటంటే... కరోనా విరామం తర్వాత  జరుగుతున్న ఈ అంతర్జాతీయ సిరీస్ లో ఐసీసీ విధించిన అన్ని కరోనా నియమాలను పాటించాలి. కానీ అందులో పాక్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ విఫలమయ్యాడు. మ్యాచ్ లో పాటించాల్సిన బయో-సేఫ్ ప్రోటోకాల్‌ను హఫీజ్ ఉల్లంఘించాడు. ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు అగాస్ బౌల్ ప్రక్కనే ఉన్న గోల్ఫ్ కోర్సుకు మొహమ్మద్ హఫీజ్ టీమ్ వెళ్ళింది. అక్కడ ఓ వృద్ధ మహిళతో హఫీజ్ ఫోటో దిగాడు. దానిని స్వయంగా తానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అది కాస్త వైరల్ కావడంతో హఫీజ్ కు తాను చేసిన తప్పు తెలిసింది. దాంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్ళాడు హఫీజ్. కాబట్టి అతను ఈ రోజు ప్రారంభం కానున్న రెండో టెస్ట్ కు దూరం అయినట్లే. మరి ఈ విషయం పై పాకిస్థాన్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాయి అనేది చూడాలి.