ఆ నలుగురిలో అతడే అత్యుత్తమం : నబీ

ఆ నలుగురిలో అతడే అత్యుత్తమం : నబీ

క్రికెట్ లో గొప్ప ఆటగాళ్ల మధ్య పోలికలు ఉండటం చాలా సాధారణం. ప్రతి తరానికి కొంత మంది గొప్ప ఆటగాళ్ళు ఉంటారు కానీ  అందులో ఎవరు అత్యుత్తమం అని  తేల్చడం చాల కష్టం. ''విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్ మరియు స్టీవ్ స్మిత్ ప్రస్తుత క్రికెట్లో ఆద్భుతమైన ఆటగాళ్లు.ఈ ప్రతి ఒక్కరూ తమ జట్టుకు నాయకత్వం వహించారు. అందువల్ల ఈ ఆటగాళ్ళ మధ్య  పోలికలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి.  వారి అభిమానులు, నిపుణులు ఒకరి కంటే మరొకరు ఎందుకు ఎందుకు గొప్పో చర్చిస్తూనే ఉంటారు.

అయితే ఇప్పుడు ప్రముఖ ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నబీ ఈ విషయం పై స్పందించాడు . ''మీ ప్రకారం ఎవరు నంబర్ 1 బ్యాట్స్మాన్? విరాట్, స్టీవ్, విలియమ్సన్ లేదా జో రూట్" అని అడిగారు. దానికి... "ఈ రోజుల్లో  గొప్ప ఆటగాడు  స్మిత్ అని నేను అనుకుంటున్నాను!" అంటూ నబీ దానికి సమాధానం ఇచ్చాడు. ఇక ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఆ ఫ్రాంచైజీలో తన అభిమాన ఆటగాడిగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఎంపిక చేశాడు.