హైదరాబాద్ సిద్ధంగా ఉంది : అజారుద్దీన్

హైదరాబాద్ సిద్ధంగా ఉంది : అజారుద్దీన్

ఈ ఏడాది ఐపీఎల్ ను కేవలం ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, ఢిల్లీ వంటి ఈ ఆరు వేదికలోనే నిర్వహించనున్నట్లు ఐపీఎల్ పాలక మండలి, బీసీసీఐ ప్రకటించాయి. అయితే, ముంబైలోని వాంఖడే స్టేడియంలోని సిబ్బంది కరోనా బారిన పడటం అలాగే అక్కడ కేసులు అధిక సంఖ్యలో రావడంతో బీసీసీఐ హైదరాబాద్, ఇండోర్‌ లను స్టాండ్-బై వేదికలుగా ఉంచినట్లు తెలుస్తుంది. అయితే దీని పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..'ఈ కష్టకాలంలో మనం ఒకరికొకరు అండగా ఉందాం. ఐపీఎల్ 2021 మ్యాచులను సురక్షితమైన వేదికలలో నిర్వహించేలా చూడాలనుకుంటున్నాం. ఇందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సౌకర్యాలను బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్తున్నాము' అని మహ్మద్ అజారుద్దీన్ ట్విట్ చేసారు. అయితే దీని పై ఓ బీసీసీఐ సీనియర్ అధికారి  ''హైదరాబాద్ స్టాండ్-బై వేదికలలో ఒకటి, కానీ ముంబై నుండి మ్యాచ్ వేదికలను మార్చడం గురించి మేము ఇంకా ఆలోచించడం లేదు. ఇంత తక్కువ సమయంలో మరో బయో బబుల్ సృష్టించడం కష్టమవుతుంది" అని ఆయన చెప్పారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.