ఈద్‌ సందర్భంగా రవిశాస్త్రికి గిఫ్ట్ పంపిన మహ్మద్ షమీ... ఏంటంటే..?

ఈద్‌ సందర్భంగా రవిశాస్త్రికి గిఫ్ట్ పంపిన మహ్మద్ షమీ... ఏంటంటే..?

సోమవారం నిన్న జరుపుకున్న ఈద్ సందర్భంగా హెడ్ కోచ్ రవిశాస్త్రికి మటన్ బిర్యానీతో సహా కొన్ని ప్రత్యేక బహుమతులు పంపినట్లు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తెలిపారు. ప్యాక్ చేసిన మటన్ బిర్యానీ, మరియు ఈద్ ప్రత్యేక డెజర్ట్‌లు - ఖీర్ మరియు సెవియన్ వంటివి రవిశాస్త్రి పంపినట్లు వాటి ఫోటోలను మొహమ్మద్ షమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. "రవి భాయ్, నేను సెవియన్, ఖీర్ మరియు మటన్ బిర్యానీలను ప్యాక్ చేసి పంపించాను. మీరు దాన్ని స్వీకరించాలి" అని మహ్మద్ షమీ ట్విట్ చేసారు. అయితే అంతకుముందు , షమీ తన అభిమానులను మరియు తోటి క్రికెటర్లను సోషల్ మీడియాలో ఈద్ శుభాకాంక్షలు తెలిపారు: "ఈద్ ముబారక్! అల్లా మీ కలలు, ఆశలన్నీ నెరవేర్చగలడు" అని అన్నారు.