తండ్రి సమాధి వద్దకు సిరాజ్...

తండ్రి సమాధి వద్దకు సిరాజ్...

టీమిండియా పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ ఆసీస్ పర్యటనలో తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్ట్ లో 5 వికెట్ హల్ సాధించిన సిరాజ్ పేస్ దళానికి నాయకుడిగా ముందుండి నడిపించాడు. అయితే ఈ పర్యటనకు ఎంపికై జట్టుతో కలిసి సిరాజ్ ఆసీస్ లో అడుగుపెట్టిన తర్వాత తన తండ్రి మహ్మద్ గౌజ్‌ మృతి చెందారు. అయితే తన తండ్రి మరణించిన తర్వాత అందరూ అతను తిరిగి భారత్ కు వచ్చేస్తాడు అనుకున్నారు. కానీ సిరాజ్ మాత్రం జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ భాధను దిగమింగుకొని అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అయితే టెస్ట్ సిరీస్ లో విజేతలుగా నిలిచిన టీం ఇండియా ఈరోజు తిరిగి భారత్ కు చేరుకుంది. అయితే సిరాజ్ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకున్నాడు. వచ్చి రాగానే  అతను తన తండ్రి సమాధిని దర్శించుకున్నాడు. అయితే అప్పుడు జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్న సిరాజ్ ''టెస్ట్ జట్టుకు ఆడటం తన తండ్రి కల'' అని పేర్కొన్నాడు.