మళ్ళీ విలన్ గా మోహన్ బాబు..!!

మళ్ళీ విలన్ గా మోహన్ బాబు..!!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చి, విలన్ గా మారి ఆ తరువాత హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు మోహన్ బాబు ఇప్పటి వరకు దాదాపు 500 సినిమాల్లో నటించారు.  నటుడిగా సుదీర్ఘ ప్రయాణంలో మోహన్ బాబు ఎన్నో విలక్షణమైన సినిమాల్లో నటించారు.  

హీరోగా మారిన తరువాత మోహన్ బాబు విలన్ రోల్స్ చేయలేదు.  ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మోహన్ బాబు తమిళ్ హీరో సూర్య సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.  సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న సూరరై పోట్రు సినిమాలో విలన్ రోల్ చాలా కీలకంగా ఉంటుందట.  ఆ రోల్ కు మోహన్ బాబు మాత్రమే న్యాయం చేయగలరని భావించి మోహన్ బాబు ఒప్పించారట.  ప్రస్తుతం ఈ సినిమా చెన్నై ఎయిర్ పోర్ట్ లో జరుగుతున్నది.