మంచు మోహన్ బాబుకు మాతృ వియోగం !

మంచు మోహన్ బాబుకు మాతృ వియోగం !

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు మాతృ వియోగం సంభవించింది.  ఆయన తల్లి లక్ష్మమ్మ (85) తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్లో ఈరోజు ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు.  ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో ఉన్నారు.  విషయం తెలుసుకున్న ఆయన, కుటుంబ సభ్యులు తిరుగుపయనమయ్యారు.  రేపు 21వ తేదీన ఆమె అంత్యక్రియలు తిరుపతిలో జరగనున్నాయి.