చంద్రబాబుపై మోహన్‌బాబు ఫైర్..

చంద్రబాబుపై మోహన్‌బాబు ఫైర్..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు సినీనటుడు మోహన్ బాబు.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... చంద్రబాబు నాకు ఎంతో సన్నిహితుడని, విద్యానికేతన్ కళాశాల గొప్పదని చంద్రబాబే  స్వయంగా చెప్పారని గుర్తుచేసిన మోహన్ బాబు.. 2014-15 సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. అప్పుడప్పుడు మా కాలేజీకి భిక్షమేస్తూ వచ్చారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు... విద్యానికేతన్  విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పై ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేనది మండిపడ్డ ఆయన... చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడని.. విద్యాభివృద్థికి ఏపీ సర్కార్ ఏ మాత్రం పనిచేయడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ఎందుకు వాగ్థానాలు  చేస్తున్నారు చంద్రబాబు అంటూ ప్రశ్నించారు మోహన్ బాబు. అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారని నిలదీశారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు.. ఏ రాజకీయ పార్టీ ప్రోత్సాహంతో నేను మాట్లాడడం లేదంటూనే మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.