రాజకీయంగా ఒకడు దెబ్బ కొట్టాడు...మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు.!

రాజకీయంగా ఒకడు దెబ్బ కొట్టాడు...మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు.!

వినాయకచవితి సంధర్భంగా నటుడు మోహన్ బాబు ఎన్టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజీకీయంగా ఎదగలేకపోయానన్న అసంతృప్తి ఇప్పటికీ ఉండిపోయిందని అన్నారు. ఒకడు దెబ్బ కొట్టడంవల్లే తన రాజకీయ జీవితం నాశనమైందని అన్నారు. ఇద్దరూ కలిసి ఒక వ్యాపారాన్ని కూడా ప్రారంభించామని కానీ మోసం చేసాడని తెలిపారు. అయితే ఇప్పుడు అతని పేరు చెప్పనని   ఆ తరవాత సీఎం గా కూడా గెలిచాడని అన్నారు. చచ్చిన పామును చంపడం ఎందుకని వదిలేసానని తెలిపారు. తెలంగాణ లో పాలన ఎలా ఉంది అని యాంకర్ అడగగా..బాగుందని అన్నారు. భారత ప్రధాని అంటే తనకు ఇష్టమని  మోహన్ బాబు తెలిపారు. మోడీకి భారత ప్రధాని అవుతారని ముందే చెప్పానని అన్నారు. అనేక సంధర్భాల్లో మోడీని కలిసినట్టు తెలిపారు. తనను మోడీ బడా భయ్యా అని పిలుస్తారని తెలిపారు.