పాదయాత్ర చేసి...ప్రజల కష్టాలు తెలుసుకొని

పాదయాత్ర చేసి...ప్రజల కష్టాలు తెలుసుకొని

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి.  ఇప్పటికే వైకాపా 150 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. జగన్ తప్పకుండా విజయం సాధిస్తాడని నమ్మకంతో పార్టీ నాయకులు ఉన్నారు.  ఇప్పటికే వైకాపా పార్టీ కార్యాలయాల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.  వైకాపా విజయం గురించి సినీ నటుడు, వైకాపా నాయకుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. 

"ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్ కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చాడు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేసారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్." అని ట్వీట్ చేశారు.