దృశ్యం 2 టీజర్ రిలీజ్..

దృశ్యం 2 టీజర్ రిలీజ్..

సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమా అంటేనే ప్రత్యేక స్థాయి ఉంటుంది. అతడు నటించిన మలయాళ సినిమా దృశ్యం బ్లాక్ బాస్టర్‌గా రికార్డులు తిరగరాసింది. తన భాషలోనే కాకుండా ఇరుగు పొరుగు భాషల్లో కూడా సంచలనాలు చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనాలు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో కూడా భారీ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. దీనిని అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయింది. దృశ్యం సినిమాలో హీరో తన తెలితేటలతో తన కుటుంబంపై హత్యా నేరం పడకుండా కాపాడతాడు. తన భార్య, పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీసులను, వ్యవస్థను తప్పు దోవ పట్టిస్తాడు. ఇలాంటివి ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. అన్నింటిని కలిపి ఎంతో వినోదాత్మకంగా నిర్మించారు. కుట్టి ఫ్యామిలీ రహస్యాన్ని ఎప్పటికీ దాచి ఉంచాలని ప్రయత్నిస్తారు. కానీ రహస్యాలు ఎప్పటికీ దాగవని, సమయం గడిచేకొద్ది బయటపడతాయని రెండో భాగంలో చూపించనున్నారు. ఈసారి తన కుటుంబాన్ని కాపాడేందుకు హీరో ఎలాంటి కష్టాలు చవి చూశాడు. ఎన్ని ప్రమాదాలను అదిగమించాడనేది రెండో భాగంలో చూడాల్సిందే. ఈ దృశ్యం2 సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.