చిరు లూసిఫర్ రీమేక్ డైరెక్టర్ మొదటి సినిమా సూపర్ హిట్.. నేటికి 19 ఏళ్ళు !

చిరు లూసిఫర్ రీమేక్ డైరెక్టర్ మొదటి సినిమా సూపర్ హిట్.. నేటికి 19 ఏళ్ళు !

మోహన్ రాజా ఈ పేరు తెలియని సినిమా ప్రేమికులు ఉండరు. తనదైన కథలతో ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త దనాన్ని చూపిస్తాడు. అతడు తీసే వినూత్న కథలకు ప్రేక్షకులు ఫిదా అవ్వక మానరు. అయితే మోహన్ రాజా మొదట తమిళ సినీ పరిశ్రమలో చేశారు. దాని తరువాత కామెడీ ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి విలక్షణ కథలతో సినిమాలలో తన మార్క్ వేసుకున్నాడు. నేడు తన మొదటి సినిమా వచ్చి సరిగ్గా 19 సంవత్సరాలు కావడంతో మోహన్ రాజా ఓ ట్వీట్ చేశాడు. ‘నేను 21-12-2001లో నా తొల తెలుగు చిత్రం హనుమాన్ జంక్షన్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఆ సినిమా విడుదలయినప్పుడు థియేటర్లలో విన్న నవ్వులను నేను ఇప్పటికీ మరిచిపోలేన’ని మోహన్ రాజా తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. దాంతో పాటుగా సినిమాకు చెందిన కొన్ని ఫోటోలను దీనికి అనుసంధానం చేశాడు. ఇదిలా ఉంటే హనుమాన్ జంక్షన్ సినిమా అర్జున్ సార్జా, జగపతి బాబులు ప్రధాన పాత్రలుగా తెరకెక్కింది. ఇందులో స్నేహా, లయ హీరోయిన్‌లుగా చేశారు. వీరితో పాటు హీరో వేణు, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎల్‌బీ శ్రీరాంలు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినమాలో అప్పట్లో మంచి హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే మోహన్ రాజా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో లూసిఫర్ సినిమా రీమే చేయనున్నాడు.