క్యాడ్బరీ డెయిరీ మిల్క్ తీపి తగ్గనుంది!!

క్యాడ్బరీ డెయిరీ మిల్క్ తీపి తగ్గనుంది!!

సుప్రసిద్ధ చాక్లెట్ కంపెనీ మాండలీజ్ ఇంటర్నేషనల్ తక్కువ చక్కెర ఉన్న డెయిరీ మిల్క్ ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. 'క్యాడ్బరీ డెయిరీ మిల్క్ 30% లెస్ షుగర్'లో సాధారణ డెయిరీ మిల్క్ చాక్లెట్ తో పోలిస్తే 30 శాతం తక్కువ చక్కెర ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త చాక్లెట్ లో ఎలాంటి కృత్రిమ స్వీటెనర్లు ఉండవని సంస్థ భరోసా ఇస్తోంది. డెయిరీ మిల్క్ మిగతా ఉత్పాదనల మాదిరిగానే ఈ కొత్త చాక్లెట్ వినియోగదారులకు విరివిగా లభ్యం అవుతుందని ప్రకటించింది. 

'క్యాడ్బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్లకి భారత్ లో లభించిన ఆదరణను చూసి కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ ఉత్పాదనకు కూడా అంతే జనాదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్టు' మాండలీజ్ ఇండియా అధ్యక్షుడు దీపక్ అయ్యర్ సోమవారం చెప్పారు. క్యాడ్బరీ డెయిరీ మిల్క్ 30 శాతం తక్కువ చక్కెర చాక్లెట్ ని భారత్, బ్రిటన్ లలోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాలలో పలువురు వైజ్ఞానికులు, పోషణ విశేషజ్ఞులు, చాక్లెట్ నిపుణుల ప్రత్యేక బృందం రెండేళ్ల పాటు ఎంతో శ్రమించి తయారు చేసింది.