పాపం : కోటి రూపాయలు తగలబెట్టిన కోతి..

పాపం : కోటి రూపాయలు తగలబెట్టిన కోతి..

వరంగల్ రూరల్  జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని దుర్గా పత్తి మిల్లులో సాయంత్రం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . మంటల ధాటికి ఆరుబయట ఉన్న పత్తి పూర్తిగా దగ్ధమైంది. మిల్లు యాజమాన్యం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారు రెండు వేల క్వింటాళ్ల మేర పత్తి నష్టపోయినట్లు, కోటి రూపాయల  ఆస్తి నష్టం సంభవించినట్లు మిల్ యాజమాన్యం తెలిపింది. ఇదంతా ఒక కోతి  వలన జరిగినట్లు తెలుస్తుంది. మిల్లు లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద హైటెన్షన్ వైర్ పైకీ కోతీ దూకడంతో నిప్పురవ్వలు, బయట ఉన్న పత్తి దగ్ధమైంది. పత్తికి ఇన్సూరెన్స్ ఉన్నట్లు యజమాని తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ఇది ప్రమాద వశాత్తు జరిగిందా ? లేక మరేదైనా కారణం ఉందా ?  వాస్తవానికి జరిగిన నష్టం ఎంత ? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.