విశాఖకు మోనో రైలు.. ఎంటీ ట్రైన్‌ స్పెషల్‌..?

విశాఖకు మోనో రైలు.. ఎంటీ ట్రైన్‌ స్పెషల్‌..?

ఏపీ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన విశాఖపట్నంలో మోనో రైలు ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. విశాఖ ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో స్పష్టం చేసింది. విశాఖకు గత ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిపాదించింది. మొత్తం మూడు మార్గాల్లో 42.5 కిలోమీటర్ల పొడవున మెట్రో కారిడార్‌ వేయాలని అంచనాలూ రూపొందించింది. రూ.8,300 కోట్ల వ్యయం అవుతుందని లెక్క తేల్చి టెండర్లు కూడా పిలిచారు. ఐతే.. జగన్‌ ప్రభుత్వం మాత్రం మెట్రోను పక్కన పెట్టి మోనో రైలు వైపు మొగ్గుచూపింది. 

అత్యాధునిక ఫ్యాబ్రికేటెడ్‌ సింగిల్‌బీమ్‌ ద్వారా నడిచే మోనో రైలు వ్యవస్థ ప్రపంచ దేశాల్లో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. సాధారణంగా మెట్రో రైలు స్తంభాల వ్యాసార్థం 1.5 మీటర్ల నుంచి 1.8 మీటర్ల వరకు వుంటే మోనో రైలుకు మీటరు నుంచి 1.2 మీటర్ల వరకే ఉంటుంది. భూమి నుంచి కేవలం 5.5 మీటర్ల ఎత్తులో మోనో ట్రాక్‌ నిర్మిస్తారు. రైలుకు పైనుంచి కాకుండా కింది నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. అంటే..  మెట్రోతో పోల్చుకుంటే...మోనో వ్యయం కూడా తక్కువే.