నూజువీడు సీడ్స్ కు చుక్కెదురు

నూజువీడు సీడ్స్ కు చుక్కెదురు

నూజువీడు సీడ్స్ కంపెనీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. మోన్సాంటో అనుబంధ సంస్థ మహికో మోన్సాంటో బయోటెక్ పై వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.  దీంతో గత కొన్నేళ్లుగా మోన్సాంటో పోరాటానికి సుప్రీంకోర్టులో విజయం దక్కింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.  ఇండియాలో జన్యుపరంగా మార్పు చేసిన పత్తి విత్తనాల పేటెంట్లను మోన్సాంటో సొంతం చేసుకోవచ్చని తీర్పు చెప్పింది.  దీంతో బీటీ పత్తి విత్తనాలు కోసం మోన్శాంటో పేటెంట్ చెల్లుబాటు అవుతుంది. ఢిల్లీ హైకోర్టు తీర్పును రద్దు చేయడంతో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. విత్తనాలు, మొక్కలు, జంతువుల వంటి కొన్ని వస్తువులు భారతీయ చట్టాల ప్రకారం పేటెంట్ చేయలేవని సుప్రీం చెప్పింది. మోన్శాంటో జీఎం పత్తి విత్తనాలపై పేటెంట్లలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థగా పేర్కొంది. మోన్శాంటో, దేశీయ సీడ్ కంపెనీల మధ్య న్యాయపోరాటం ఏళ్లుగా నడుస్తోంది. ఇన్నేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు  చెప్పింది. మోన్సాంటోకు దేశీయ సీడ్ కంపెనీలైన్ కావేరీ సీడ్స్, అంకూర్ సీడ్స్, అజిత్ సీడ్స్ తో వివాదం నడుస్తోంది. వీటితో పాట్లు మరో ఎనిమిది దేశీ ప్లేయర్స్ నూజువీడు సీడ్స్ , ప్రభాత్ అగ్రి బయోటెక్, ప్రవర్థన్ సీడ్స్, అమర్ బయోటెక్, శ్రీరామా అగ్రి బయోటెక్ తదితర కంపెనీలకు రాయల్టిని తిరస్కరించింది.