తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలొచ్చేశాయ్‌

తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలొచ్చేశాయ్‌

తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. రెండు నుంచి మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరిస్తాయని అధికారులు చెప్పారు. రుతుపవనాల ప్రభావంతో పలు చోట్లు వర్షం మొదలైంది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌, ఎల్బీనగర్, లక్డీకాపూల్, చార్మినార్, మొఘల్ పురా, అబిడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.  తెలంగాణలో ఈసారి సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. జూన్ నెలలో లోటు వర్షపాతం ఉంటుందని.. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌ల్లో మంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు.