జూన్ 4న కేరళకు నైరుతి రుతుపవనాలు

జూన్ 4న కేరళకు నైరుతి రుతుపవనాలు

జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు స్కైమెట్ సంస్థ తెలిపింది. 2019లో సరాసరి వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవనుందని ప్రకటించింది. జులై 15వ తేదీ వరకు రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయని పేర్కొన్నారు. సకాలంలో కురిసే వర్షాలు వరి, సోయాబీన్‌, పత్తి వంటి పంటలకు అనుకూలమని తెలిపింది. దేశ దీర్ఘకాల సగటులో 93 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దేశ‌వ్యాప్తంగా వ‌ర్ష పాతం న‌మోద‌య్యే ప్రాంతాలు 70 శాతం క‌న్నా ఎక్కువే ఉన్నట్లు స్కైమెట్ సీఈవో తెలిపారు.