మాన్సూన్ వెడ్డింగ్ వీడియో

మాన్సూన్ వెడ్డింగ్ వీడియో

కష్టసుఖాల్లో కలిసి ఉంటామనే పెళ్లి ప్రమాణాన్ని ఆ క్షణం నుంచే అమలుచేసి చూపించింది ఆ జంట. జెఫర్సన్, జోబెల్ డి లాస్ ఏంజెల్స్ అనే ఫిలిప్పినో దంపతులు మొన్న పెళ్లి చేసుకొన్నారు. నైరుతి రుతుపవనాల కారణంగా ఫిలిప్పీన్స్ లో భారీగా కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో బులకాన్ ప్రాంతంలోని హగొనోయ్  పట్టణం జలమయం అయింది. కానీ ఇవేవీ ఈ జోడీ ఉత్సాహాన్ని నీరు గార్చలేకపోయాయి. శాంటో రోసారియో చర్చిలో ఇంతెత్తున వరదనీరు నిలిచిపోయింది. ఆ నీటిలో నుంచే పెళ్లికూతురు లాస్ ఏంజెల్స్ నడుచుకుంటూ వచ్చింది. 

ఆ రోజున ఈ జంట రెండు ఉత్సవాలు జరుపుకుంది. మొదటిది పెళ్లి రెండోది వాళ్ల చిన్నకూతురు నామకరణోత్సవం. ఈ పెళ్లి ఫోటోలు, వీడియోని వాళ్ల చుట్టం తెరె బనారెజ్ బటిస్టా అనే ఆవిడ తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇక ఈ పెళ్లికి వచ్చినవాళ్లలో కొందరు చెప్పులు తడవకుండా బయటే విడిచి వస్తే, మరికొందరు అలాగే వచ్చి నీళ్లలో కాళ్లు పెట్టుకొని ఈ వింత పెళ్లిలో నవ్వులు చిందించారు.

Photos Courtesy from... Tere Bañarez Bautista