లెస్ యాక్షన్ మోర్ రొమాన్స్ !
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ హీరో ప్రభాస్. ఆ ఇమేజే ఆయన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. కానీ ప్రభాస్ మాత్రం అప్పుడప్పుడు యాక్షన్ సినిమాల్ని పక్కనబెట్టి రొమాంటిక్ సినిమాలు కూడ చేస్తుంటాడు. అలా వచ్చినవే 'డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలు.
ప్రస్తుతం భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'సాహో' చేస్తున్న ఆయన తర్వాతి సినిమాను మాత్రం పూర్తిగా రొమాంటిక్ పంథాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో లెస్ యాక్షన్ మోర్ రొమాన్స్ ఉంటుందట. ఇప్పటికే ఇటలీలో షూటింగ్ పనుల్ని మొదలుపెట్టింది టీమ్. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)