దేవరగట్టు ఉత్సవంలో ఉద్రిక్తత.. 50 మందికి పైగా గాయాలు 

దేవరగట్టు ఉత్సవంలో ఉద్రిక్తత.. 50 మందికి పైగా గాయాలు 

ప్రతి ఏడాది విజయదశమి రోజున కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో కర్రల ఉత్సవం జరుగుతుంది.  ఈ ఉత్సవరంలో ప్రజలు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది.  ప్రతి ఏడాదిలాగానే ఇలవేల్పును దక్కించుకోవడం కోసం అక్కడి గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు.  ఉద్రిక్తతలకు దారితీయకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేశారు.  సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది.  దాదాపు 1000 మంది పోలీసులు పహారాలో ఈ ఉత్సవం జరిగింది.  

అయినప్పటికీ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.  ఈ ఉత్సవంలో పాల్గొన్న గ్రామస్తులు మద్యం సేవించి కర్రలతో ఫైట్ చేసుకున్నారు.  ఈ కొట్లాటలో దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు.  గాయపడ్డవారిని హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.