భారత్‌లో కంటే అక్కడే భారతీయులు ఎక్కువ మృతి..!

భారత్‌లో కంటే అక్కడే భారతీయులు ఎక్కువ మృతి..!

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లో 30 వేలకు చేరువలో ఉన్నాయి.. ఇప్పటికి 29,435 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 934 మంది మృతిచెందారు. కరోనాతో భారత్‌లో కంటే బ్రిటన్‌లోనే ఎక్కువ మంది ఇండియన్స్ చనిపోయారని తెలుస్తోంది. భారత్‌లో మొత్తం మరణాలు వెయ్యి లోపే ఉండగా.. బ్రిటన్‌లో మాత్రం చనిపోయిన భారత సంతతి ప్రజల సంఖ్య ఎప్పుడో వెయ్యి దాటేసింది. బ్రిటన్‌లో కరోనాతో మరణిస్తున్న ప్రతీ 10 మందిలో ఒకరు భారతీయులేనని ఓ సర్వే తేల్చింది. భారత్‌లో జనాభా 130 కోట్లు కాగా, కరోనాతో వెయ్యి లోపే మరణాలు సంభవించాయి. అదే బ్రిటన్ లో భారత సంతతి ప్రజల సంఖ్య 15 లక్షలు. ఆ లెక్కన చూస్తే బ్రిటన్‌లో భారత సంతతి వాళ్ల మరణాల సంఖ్య భారత్‌లో కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.