మహేష్ కోసం జాబితా పెరిగింది...

మహేష్ కోసం జాబితా పెరిగింది...

మహేష్ బాబు మహర్షి హిట్ తరువాత అనిల్ రావిపూడితో చేస్తున్నారు.  ఈ సినిమా తరువాత ఎవరితో అన్నది ఇంకా సెట్ కాలేదు.  మహేష్ 27 వ సినిమా కోసం చాలా పెద్ద లిస్ట్ తయారైంది. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది పరశురామ్.  గీత గోవిందం తరువాత పరశురామ్ మహేష్ తో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.  అందుకోసం కథను రెడీ చేసుకొని మహేష్ కు వినిపించారు. కథ నచ్చడంతో... పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట.  స్క్రిప్ట్ కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు.  పరశురామ్ కథ ఒకే అయితే ఈ సినిమా గీతా ఆర్ట్స్ లో ఉంటుంది.  

పరశురామ్ తో పాటు కొరటాల శివ కూడా లైన్లో ఉన్నాడు.  మెగాస్టార్ తో సైరా పూర్తికాగానే కొరటాల శివ సినిమా పట్టాలెక్కుతుంది.  వీలైనంత త్వరగా సినిమాను కంప్లీట్ చేయాలనే కసితో ఉన్నాడు శివ.  మెగాస్టార్ సినిమా పూర్తైన వెంటనే మహేష్ తో రెడీ అంటున్నాడు.  అంటే మెగాస్టార్ సినిమా జనవరి లోపు పూర్తి చేయాలి.  ఇది సాధ్యం అవుతుందా చూద్దాం.  కొరటాలతో పాటు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ తదితరులు కూడా లైన్లో ఉన్నారు.  వచ్చే ఏడాది చివర్లో మహేష్... రాజమౌళి సినిమాను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.