విజయ్ మాల్యా ఆస్తుల స్వాధీనానికి కోర్టు ఉత్తర్వులు

విజయ్ మాల్యా ఆస్తుల స్వాధీనానికి కోర్టు ఉత్తర్వులు

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కష్టాలు మరిన్ని పెరిగాయి. ఫెరా నిబంధనల ఉల్లంఘనల కేసులో బెంగుళూరులోని మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఢిల్లీలోని ఒక కోర్టు ఆదేశించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి చెందిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్  ఎన్ కె మత్తా, న్యాయవాది సంవేదనా వర్మ ద్వారా ఈ వ్యవహారంపై కోర్టు ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి బెంగుళూరు పోలీసులు మరికొంత సమయం అడిగారు. దీని తర్వాత చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ తాజా ఆదేశాలు ఇచ్చారు. 

జూలై 10 కల్లా ఆస్తులను అటాచ్ చేయాల్సిందిగా కోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అదే రోజు ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుంది. ఇంతకు ముందు బెంగుళూరు పోలీసులు తాము మాల్యాకి చెందిన 159 ఆస్తులను గుర్తించినట్టు కోర్టుకు తెలిపారు. కానీ వాళ్లు వీటిలో ఏ ఆస్తిని అటాచ్ చేయలేకపోయారు.