అసలైన 'క్యాట్‌ వాక్‌' అంటే ఇదేనా..?

అసలైన 'క్యాట్‌ వాక్‌' అంటే ఇదేనా..?

క్యాట్ వాక్..! పేరులో క్యాట్‌ అని ఉన్నా.. నడిచేది మాత్రం వయ్యారి భామలు. కానీ.. ర్యాంప్‌పై నిజంగానే క్యాట్‌ వాక్‌ చేస్తే..? అదే అసలైన క్యాట్‌ వాక్‌ అని అందామా? ఇంతకీ జరిగిందేంటంటే.. మొరాకోలో ఓ షోలో మోడల్స్ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుండగా.. ర్యాంప్‌పై పిల్లి ప్రత్యక్షమైంది. మోడల్స్‌తోపాటు కాసేపు నడిచింది. పిల్లి చేష్టలకు ముక్కున వేలేసుకున్న ప్రేక్షకులు.. ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఇప్పుడీ వీడియో విపరీతంగా వైరల్‌ అయింది.