మసీద్ లో వందమంది ప్రార్ధనలు... షాకైన పోలీసులు...ఎక్కడో తెలుసా? 

మసీద్ లో వందమంది ప్రార్ధనలు... షాకైన పోలీసులు...ఎక్కడో తెలుసా? 

కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపథ్యంలో అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 24 వ తేదీన 21 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది.  ఈ లాక్ డౌన్ కాలంలో ఎవరూ బయటకు రాకూడదని ఆంక్షలు విధించింది.  అయినప్పటికీ ప్రజలు బయటకు వస్తూనే ఉన్నారు.  దీంతో చాలా ప్రాంతాల్లో ఆంక్షలు మరింత కఠినం చేస్తున్నారు.  

అయితే, బెంగాల్ లో ఏం జరుగుతుందో ఎలాంటి నిబంధనలు విధిస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు.  మమతా బెనర్జీ తీసుకుంటున్న చర్యలు ఎలాంటివో బయటకు తెలియడం లేదు. అక్కడ సంఖ్య మాత్రం తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది.  కరోనా టెస్టులు ఎక్కువగా జరగడం లేదని ఒక వాదన ఉన్నది.  కరోనా కట్టడికి లాక్ సోషల్ డిస్టెన్సింగ్ ఒక్కటే మార్గం అని, విద్యా సంస్థలు, షాపులు, సినిమా థియేటర్లు మూసేసింది.  ఆలయాలు, ప్రార్ధనా మందిరాల్లోకి భక్తులను అనుమతించ వద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలను పక్కన పెట్టి వెస్ట్ బెంగాల్ లోని ముర్షిదాబాద్ లోని ఓ మసీద్ లో 100 మందికి పైగా ఒకేచోట చేరి ప్రార్ధనలు చేయడం మొదలుపెట్టారు.  

ఒకేచోట 100మందికి పైగా మసీద్ లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.  మసీద్ లో వంద మందికి పైగా ఉండటాన్ని చూసి పోలీసులు షాకయ్యారు.  మసీద్ లో ఉన్న అందరిని పంపించేశారు.  లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.