అఖిల్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

అఖిల్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

యంగ్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ వరుసగా ప్రకటించేస్తున్నారు. కానీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అఖిల్ మూవీ సంగతి మాత్రం ఎంతకీ తెగడం లేదేంటని అక్కినేని అభిమానులు తెగ ఇదై పోతున్నారు. వారి సందేహాలకు తెర పడింది. అఖిల్, పూజా హెగ్డే జంటగా జీఏ 2 బ్యానర్ లో బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ రిలీజ్ ప్రకటన వచ్చేసింది. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అక్కినేని ఫ్యామిలీ హీరోస్ లో నాగచైతన్య మూవీ 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16న రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది. అలానే ఇప్పుడు అఖిల్ మూవీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది. ఇక బాస్... అక్కినేని నాగార్జున మూవీ 'వైల్డ్ డాగ్' విడుదల తేదీకి సంబంధించిన ప్రకటనే రావాల్సి ఉంది!