టెస్టుల్లో బుమ్రా రికార్డు

టెస్టుల్లో బుమ్రా రికార్డు

టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టుల్లో అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో షాన్ మార్ష్ ను అవుట్ చేయడంతో బుమ్రా ఈ రికార్డు సాధించాడు. ఈ సంవత్సరం జనవరి 5న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో.. బుమ్రా టెస్టుల్లోకి అరంగేట్రం చేసాడు. ఇప్పటి వరకు 9 టెస్టులాడిన అతను 42 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ జాబితాలో ఇంతకుముందు దిలీప్ దోషి (1979 - 40 వికెట్లు) మొదటి స్థానంలో ఉండగా.. తాజాగా దోషిని బుమ్రా వెనక్కి నెట్టాడు. ఇక మూడో స్థానంలో వెంకటేశ్ ప్రసాద్ (1996- 37 వికెట్లు) ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో నరేంద్ర హిర్వాణీ (1996 - 36 వికెట్లు), శ్రీశాంత్ (2006 - 36 వికెట్లు) లు ఉన్నారు.