హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం.. తల్లీకూతురు హత్య

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం.. తల్లీకూతురు హత్య

హైదరాబాద్ పాతబస్తీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది... చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అత్త, భార్యను హత్య చేశాడో వ్యక్తి... ఇద్దరి మృతదేహాలను నల్లవాగులోని ఓ ఇంట్లో పడేశాడు.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తల్లి ఫరీదాబేగం, కూతురు ఫైజాబేగం హత్యకు గురయ్యారు. అల్లుడు రెహ్మాన్ ఈ హత్య చేశారని చెబుతున్నారు... ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు. గత కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.