తూగోజిలో తల్లీకూతుళ్ల దారుణ హత్య

తూగోజిలో తల్లీకూతుళ్ల దారుణ హత్య

 

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో తల్లీకూతుళ్ల దారుణ హత్య కలకలం రేపుతోంది. తల్లీకూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశారు దుండగులు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం దండుగంగమ్మ వారి గుడి వీధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బలస మాధవి (45) ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పని చేస్తున్నారు. కుమార్తె కరుణ(18) ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. మాధవి భర్త శ్రీనివాస్‌, కుమారుడు విజయ్‌ ఇద్దరూ కాకినాడ విజయశ్రీ హోటల్‌లో పనిచేస్తున్నారు. వారానికొకసారి ఇంటికి వచ్చి వెళ్తుంటారు. 

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి తల్లీకూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు సుత్తితో బలంగా తలపై మోది హత్య చేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. జంట హత్యల తరువాత తండ్రి, కొడుకులు పరారయ్యారని, వాళ్లిద్దరి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే వారిద్దరికీ ఈ హత్యలలో ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు, ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం. గత కొంతకాలంగా భర్తతో ఆమె ఘర్షణ పడుతోందని అంటున్నారు.