రైలు ఢీకొని తల్లీకొడుకు మృతి...

రైలు ఢీకొని తల్లీకొడుకు మృతి...

రైలు ఢీకొని తల్లీకొడుకు మృతిచెందిన విషాద ఘటన నిజామాబాద్‌లో జిల్లాలో జరిగింది... జిల్లాలోని నవీపేట్ మండలం ఫకీరాబాద్ రైల్వే గేటు దగ్గర ఈ ఘటన జరిగింది. ఫకీరాబాద్‌ దగ్గర రైల్వే గేట్ వేసి ఉండగా... పట్టాలు దాటేందుకు తల్లీ గంగమణి (45), కుమారుడు బన్ని (12) యత్నించారు. అదే సమయంలో దూసుకొచ్చిన దేవగిరి ఎక్స్‌ప్రెస్‌రైలు ఢీకొనడంతో తల్లీకొడుకు అక్కడిక్కడే మృతిచెందారు.