కరోనా భయంతో గ్రామస్థులు ఆ తల్లికొడుకును ఏం చేశారంటే... 

కరోనా భయంతో గ్రామస్థులు ఆ తల్లికొడుకును ఏం చేశారంటే... 

తెలంగాణలో  కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి.  కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని  జిల్లాలు అప్రమత్తం అయ్యాయి.  అయితే, కామారెడ్డి జిల్లాలోని జంగంపల్లి గ్రామంలో ఓ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి సుధారాణి, ఆమె కొడుకు రాజేష్ లు ఇటీవలే ఆసుపత్రికి వెళ్లి వచ్చారు.  ఆసుపత్రిలో సుధారాణి కూతురు  పుట్టిన పాపకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వీరికి కూడా టెస్టులు చేశారు.  

అయితే, వీరికి నెగెటివ్ వచ్చింది.  కానీ, ఈ తల్లికొడుకును ఊర్లోకి అడుగ పెట్టనివ్వలేదట . ఊర్లోకి వస్తే కరోనా వస్తుందేమో అని భయపడుతున్నారు.  తమకు కరోనా లేదని, నెగెటివ్ వచ్చిందని చెప్పినా వినలేదట.  ఊరి చివర ఉన్న స్కూల్ లోని గదిలో ఉండాలని ఆదేశించారు.   అయితే, ఇంట్లోనే ఉంటామని, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటామని చెప్పినా గ్రామస్తులు వినడం లేదని అంటున్నారు.  కరోనా కంటే గ్రామస్తుల టార్చర్ ఎక్కువగా ఉందని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.