చెరువులో దూకి తల్లి సహా ముగ్గురు మృతి

చెరువులో దూకి తల్లి సహా ముగ్గురు మృతి

అనంతపురం జిల్లా బుక్కపట్నంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన రమాదేవికి పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన కృష్ణతో ఎనిమిదేళ్ల కిందట వివాహమయింది. అయితే ఈ జంట పొట్టకూటి కోసం బెంగుళూరుకు వలస వెళ్లారు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణ, రమాదేవి దంపతులకు బబ్లూ(6), జోసియో (4) ఇద్దరు కుమారులున్నారు. కొద్దిరోజుల క్రితం పుట్టినిల్లు బుక్కపట్నంకు.. రమాదేవి పిల్లలతో సహా వచ్చింది. సోమవారం తిరిగి బెంగుళూరు వెళ్ళుతున్నానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి బెంగుళూరుకు బయలుదేరింది రమాదేవి. మార్గమధ్యలో మధ్యలో ఏం అయిందో ఏమో కానీ.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రమాదేవి సహా ఇద్దరు కుమారుల మృతదేహాలను బుక్కపట్నం చెరువులో స్థానికులు గుర్తించారు. సమచారం తెలుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రమాదేవి మృతుకి కారణాలు తెలియరాలేదు.