హన్మకొండలో తల్లీ కూతురు ఆత్మహత్య

హన్మకొండలో తల్లీ కూతురు ఆత్మహత్య

కుమారుడి మృతి తట్టుకోలేక తల్లీ కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కలకలం రేపింది. దేశాయిపేటకు చెందిన కానిస్టేబుల్ మనుగొండ బాబు, సరిత దంపతులకు కుమారుడు రోహిత్, కుమార్తె మధుమిత ఉన్నారు. 2007లో భర్త చనిపోవడంతో ప్రభుత్వం సరితకు రెవెన్యూ శాఖలో ఆర్ఐగా ఉద్యోగం కల్పించింది. ఈ ఏడాది మేలో జరిగిన రోడ్డుప్రమాదంలో కుమారుడు రోహిత్ చనిపోయాడు. ఓ వైపు భర్త, మరో వైపు కన్న కొడుకు ఇద్దరు దూరంకావడంతో సరిత మానసిక ఆవేదనకు గురవుతుంది. గురువారం ఇంట్లో అందరూ దేశాయిపేటలో ఓ శుభకార్యానికి వెళ్లారు. ఈ క్రమంలో సరిత, మధుమిత ఇంట్లో ఉరివేసుకుని చనిపోయారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆమ్రపాలి ఘటనా స్ధలికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు.