వీడు కొడుకేనా?

వీడు కొడుకేనా?

కన్నతల్లి కన్నుమూస్తే కనీసం అంత్యక్రియలు నిర్వహించకుండా.. తల్లి మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకున్నాడు ఓ కుమారుడు. తన తల్లి కన్నుమూస్తే.. గుట్టుచప్పుడు కాకుండా కుమారుడే.. ఆ తల్లి మృతదేహాన్ని చెప్పకుప్పలో పడేసిన దారుణమైన ఘటన తమిళనాడు వెలుగుచూసింది. వివరాళ్లోకి వెళ్తే తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా ధనసింగ్‌ నగర్‌లో ముత్తు లక్ష్మణన్‌ అనే పూజారి నివాసం ఉంటున్నాడు. ఆయన తల్లి వసంతి ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఆ రాత్రికి రాత్రే.. తన తల్లి మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసి వెళ్లిపోయాడు. ఇక ఉదయం చెత్త వేసేందుకు చెత్త కుండీ దగ్గరకు వెళ్లిన స్థానికులు.. వసంత మృతదేహాన్ని చెత్తకుండీలో గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఇక పోలీసుల విచారణలో కుమారుడు లక్ష్మణన్‌ తన తల్లి శవాన్ని చెప్పకుప్పలో పడేసినట్టు తేల్చారు. అయితే, అంత్యక్రియలకు తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తల్లి డెడ్‌బాడీని చెత్త కుప్పలో వెల్లడించాడు లక్ష్మణన్‌.