అమ్మ పరీక్ష హాల్లో... పాప పోలీస్‌ చేతుల్లో...

అమ్మ పరీక్ష హాల్లో... పాప పోలీస్‌ చేతుల్లో...

ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ -4 పరీక్షలు నిర్వహిస్తోంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌... అయితే మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోని ఓ పరీక్ష కేంద్రానికి ఓ చిన్నారిని తీసుకుని పరీక్షకు హాజరైంది తల్లి. పరీక్ష ప్రారంభమైంది... బయట ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడవ సాగింది... దీంతో ఆ పరీక్ష కేంద్రం దగ్గర విధుల్లో ఉన్న పోలీసులు... ఆ చిన్నారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఎంతకీ ఏడుపు ఆపకపోడంతో... అటూ ఇటూ తిప్పుతూ ఆ చిన్నారిని ఆడిస్తూ మొత్తానికి ఏడు ఆపగలిగారు. అయితే తల్లి పరీక్ష రాసేందుకు వెళ్లినప్పుడు... ఆ చిన్నారిని ఎవరి దగ్గర వదిలివెళ్లింది... ఆ చిన్నారిని విడిచిపెట్టి వాళ్లు ఎక్కడికి వెళ్లారన్నది తెలియాల్సిఉంది. మొత్తానికి ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చి మానవత్వాన్ని చాటుకున్నారు పోలీసులు.