వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని...

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని...

ఓ మహిళ మాతృత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. వివాహేతర సంబంధానికి అడ్డోస్తున్నాడని 17 ఏళ్ల కొడుకును కడతెర్చింది. అమ్మతనానికి మచ్చ తెచ్చిన ఈ ఘటన విజయనగరం నగరం గాయత్రి నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎం.కొండల్‌రావు, వెంకటపద్మావతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు హరిభగవాన్‌ విజయనగరంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్‌ చదువుతుండగా, కుమార్తె ఉమాదేవి పదో తరగతి చదువుతోంది. ఆరేళ్ల కిందటే వెంకటపద్మావతి వ్యవహార శైలి నచ్చక కొండలరావు విడాకులు ఇచ్చాడు. 

భర్త నుంచి దూరమై ఉంటున్న వెంకట పద్మావతికి అదే ప్రాంతానికి చెందిన గోవింద్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తరుచూ గోవింద్ ఇంటికి రావడం హరిభగవాన్ కు నచ్చకపోవడంతో తల్లిని పలుమార్లు నిలదీశాడు. ఎలాగైనా కుమారుడు హరిభగవాన్ అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. తినే ఆహారంలో నిద్రమాత్రలు కలి, నిద్రలోకి జారుకున్న తర్వాత చున్నీతో ఉరివేసింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బయట ప్రచారం చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే కుమారుడిని హత్య చేసినట్లు తెలుస్తుంది.