కన్నతల్లే తన ఇద్దరు పిల్లల్ని కడతేర్చింది

కన్నతల్లే తన ఇద్దరు పిల్లల్ని కడతేర్చింది

కన్నతల్లే తన ఇద్దరు పిల్లల్ని అతి దారుణంగా కడతేర్చింది. భార్యభర్తల మధ్య గొడవలకు చిన్నారులు బలైపోయారు. ఒళ్లుగగుర్పాటుకు గురిచేసిన ఈ ఘటన సిద్ధిపేటలోని గణేష్ నగర్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటలోని గణేష్ నగర్‌లోఉంటున్న సరోజ అనే మహిళ తన ఇద్దరు పిల్లలు ఆర్యన్ (5), హర్షవర్ధన్ (రెండున్నరేళ్లు)లను నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాతో అతి కిరాతంగా దాడిచేసి చంపింది. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హత్య అనంతరం తల్లి సరోజ కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.