కన్న కొడుకులను చంపిన తల్లి

కన్న కొడుకులను చంపిన తల్లి

ఓ తల్లి కన్న కొడుకులను కొట్టి చంపిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. గోదావరిఖని సప్తగిరికాలనీలో తల్లి రమాదేవి ఆవేశంలో తన ఇద్దరు పిల్లలను చితకబాదింది. దీంతో తీవ్ర గాయాలపాలైన పెద్ద కొడుకు అజయ్ (11) మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న చిన్న కొడుకు ఆర్యన్ (9)ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆర్యన్ కూడా మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లి రమాదేవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.