కన్న కొడుకుని ఉరివేసి చంపిన తల్లి

కన్న కొడుకుని ఉరివేసి చంపిన తల్లి

నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపింది తల్లి. చంపిన తర్వాత ఏమి తెలియనట్టు భర్తకు ఫోన్ చేసి కొడుక్కి పాము కరిచింది అర్జెంటుగా రండి అని ఫోన్ చేసి చెప్పింది. ఈలోపే గ్రామస్తులు తల్లే కొడుకును చంపిందని పోలీసులకు చెప్పడంతో.. ఆమెను అదుపులో తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొడుకుని చంపేసి ఏమీ తెలియనట్టుగా భర్తకు ఫోన్‌ చేసి కొడుకుని పాము కరిచిందని చెప్పడంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నట్లు తెలిసింది.