వివాహితపై ఏడుగురు గ్యాంగ్ రేప్‌.. వీడియో తీసి...

వివాహితపై ఏడుగురు గ్యాంగ్ రేప్‌.. వీడియో తీసి...

గుజరాత్‌ ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివాహిత అయిన మహిళ తన ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి ప్రియుడితో పారిపోయేందుకు యత్నించింది. ఈ విషయం బంధువులకు తెలియడంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఇక బంధువులపై ఆ మహిళను చిత్రహింసలకు గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్‌ సమీపంలోని నానీకరాజ్ గ్రామానికి చెందిన ఓ వివాహిత... అదే గ్రామంలో ఉంటున్న ఓ యువకుడిపై ప్రేమలో పడింది.. ఇద్దరూ కలిసి లేచిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న భర్త బంధవులు ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఇద్దరినీ పట్టుకుని గ్రామానికి ఈడ్చుకొచ్చారు. భర్తను, పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయేందుకు చూస్తావంటూ అంటూ బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టడమే కాదు... ఆమె జట్టును కత్తిరించారు. అంతటితో వారి కోపం చల్లారలేదు... ఇక వారిలో ఉన్న పశువులను నిద్రలేచారు. ఏడుగురు బంధువులు కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన భరత్ మావి, మానిబెన్ బాబోర్, శైలేష్ బరియా, రాకేశ్ బాబోర్, దినేశ్ పర్మార్, నర్సింగ్ మావి, రాజేశ్ బాబోర్‌ అనే ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.