అవసరాల కోసం బిడ్డను అమ్మేసి... ఐదు నెలల తరువాత కేసు పెట్టింది... 

అవసరాల కోసం బిడ్డను అమ్మేసి... ఐదు నెలల తరువాత కేసు పెట్టింది... 

ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి.  ఐదు నెలల క్రితం ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది.  అయితే, పుట్టిన ఆ బిడ్డను కొంతమంది బలవంతం మేరకు రూ.1.50 లక్షల రూపాయలకు అమ్మేసింది.  ఐదు నెలల తరువాత తన బిడ్డ తనకు కావాలని చెప్పి ఆసుపత్రికి వెళ్లగా సిబ్బంది సరిగా రెస్పాండ్ కాకపోవడంతో పోలీస్ కేసు పెట్టింది.  ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపురం మండలంలోని కాళేశ్వరపల్లి గ్రామంలో జరిగింది. 

కాళేశ్వరం గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది.  అప్పటికే ఆమె ముగ్గురు పిల్లలు ఉన్నారు.  నాలుగోసారి గర్భం దాల్చింది.  జూన్ 28 వ తేదీన మహాదేవ్ పూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మను ఇచ్చింది.  అయితే, ఆమె ఆర్ధిక అవసరాలను ఆసరాగా చేసుకున్న సిబ్బంది కొందరు ఆమెకు మాటలు చెప్పి బిడ్డను 1.50 లక్షలకు అమ్మేలా చేశారు.  ఐదు నెలల తరువాత చంద్రకళ తన బిడ్డ తనకు కావాలని సిబ్బందిని కోరడంతో సరైన సమాధానం చెప్పలేదట.  దీంతో చంద్రకళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.