బెజవాడలో పసిబిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి..!

బెజవాడలో పసిబిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి..!

కన్నతల్లి హృదయం కర్కషంగా మారింది...! కన్న బిడ్డనే అమ్మకానికి పెట్టింది...! నవమాసాలు మోసి... రోజులు తిరగకుండానే అంగట్లో పెట్టిన ఘటన బెజవాడలో జరిగింది. కొత్తపేట గొల్లపాలెం గట్టు సెంటరులో ఆర్ధిక భారంతో పోషించలేని పరిస్థితులో రోజుల వయసున్న పసికందును అమ్మేసిందా తల్లి. ఆనోటా... ఈ నోటా ఈ విషయం చైల్డ్‌లైల్‌కు చేరింది... చైల్డ్ లైన్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన విజయవాడ టూ టౌన్ పోలీసులు... ఆ పసికందును విడిపించి చైల్డ్ లైన్ సిబ్బందికి అప్పగించారు. ఆర్థికభారంతో పోషించలేక తన పసిబిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది.