కారు డోరుకు వేలాడుతూ.. కూతుర్ని కాపాడింది

కారు డోరుకు వేలాడుతూ.. కూతుర్ని కాపాడింది

కళ్ల ముందే తన కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్న డ్రైవర్ ను ఓ తల్లి అడ్డుకుంది. దుండగుని బారినుంచి కాపాడేందుకు ఏకంగా 10 కిలో మీటర్ల పాటు కారు డోరుకు వేలాడుతూ వెళ్లింది. అయినా కారు డ్రైవర్ అలానే ముందుకు తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన స్థానికులు కారును వెంబడించారు. 10 కి.మీ. తర్వాత  కారు డ్రైవర్ ను స్థానికులు పట్టుకొని చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నిస్సాకోడేరులో నహీం అనే వ్యక్తి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. భీమవరంలో టీచర్ గా పనిచేస్తున్న అనూష అనే యువతి తన తల్లి అరుణ కుమారితో కలిసి మధ్యాహ్నం బయటికి వెళ్లింది. ఆ సమయంలో నహీం అనూషను కారులో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న తల్లి అరుణకుమారి అడ్డుకునే ప్రయత్నం చేసింది. తల్లి చీర కారు డోరులో చిక్కుకుపోయినా డ్రైవర్ కారును ఆపకుండా ఏకంగా పది కిలో మీటర్ల దూరం తీసుకెళ్లాడు. గ్రామస్థులు అడ్డుకుని తల్లి, కూతురిని కాపాడారు.  అనూషకు తను మధ్య ప్రేమ వ్యవహరం సాగుతోందని... కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో  తాను అనూషను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టుగా నహీం చెప్పారు.  కానీ  నహీం మాటలను అనూష తోసిపుచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.