ఇద్దరు బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య 

ఇద్దరు బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య 

గుంటూరు జిల్లాలోని పొన్నూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కాలి బుడిదైపోయిన మృతదేహాలు జూపూడికి చెందిన బోనిగల శారదగా గుర్తించారు. నాలుగు నెలలుగా పొన్నూరులో కాపురముంటున్న శారద.. ఆరేళ్ల క్రితం భర్త మృతి చెందాడు. కొంత కాలంగా మరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఆమె ప్రియుడు పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపం చెంది పిల్లలతో కలిసి ఆత్యహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.