అత్తను హత్య చేసిన అల్లుడు

అత్తను హత్య చేసిన అల్లుడు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అత్తను హత్య చేశాడో అల్లుడు. జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామంలో ఒన్నాల లక్ష్మీ అనే వృద్ధురాలిని, ఆమె కూతురిని అల్లుడు గొడ్డలితో నరికాడు. ఈ దాడిలో అత్త మృతి చెందగా కూతురు సుజాత తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుజాత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.