'జగన్‌కు ఎన్టీఆర్‌ ఆశీస్సులుంటాయి'

'జగన్‌కు ఎన్టీఆర్‌ ఆశీస్సులుంటాయి'

'ఎన్టీఆర్ పడిన ఆత్మఘోష ఈరోజు నెరవేరింది. చంద్రబాబు ఓడిపోవడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది' అని టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఇవాళ ఎన్టీఆర్‌ జయంత్రి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మోత్కుపల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వల్ల ప్రతి ఒక్కరూ నష్టపోయారన్నారు. టీడీపీ జెండా చంద్రబాబుది కాదని.. నందమూరి కుటుంబానిదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా  చంద్రబాబు జెండాను వదిలి నందమూరి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు న్యాయకత్వం వల్లే ఏపీలో టీడీపీ ఓడిపోయిందని.. తెలంగాణలో చంద్రబాబు వల్లే టీడీపీ పట్టు కోల్పోయిందని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. జగన్ న్యాయకత్వంలో అన్ని వర్గాలకూ మేలు జరుగుతుందన్న ఆయన.. ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్‌కు తప్పకుండా ఉంటాయన్నారు.