చంద్రబాబు అసమర్ధుడు : మోత్కుపల్లి

చంద్రబాబు అసమర్ధుడు : మోత్కుపల్లి

సిఎం కేసీఆర్ టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును కలిసి పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.  ఈ విషయంపై మాట్లాడిన మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు మండవను కలిసి తెరాసలోకి ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు అన్నారు.  

అంతేకాదు 'పిలిస్తే మేము కూడా తెరాసలోకి వెళతాం.  ఆయనతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం.  టీడీపీలో ఉన్న సీనియర్లు అందరూ తెరాసలో చేరేందుకు రెడీగా ఉన్నారు.  చంద్రబాబు అసమర్థుడు.  ఆయన వల్ల తెలంగాణ టీడీపీకి ఒరిగేదేమీ లేదు.  ఆయనకు ఏపీలోనే దిక్కు లేదు ఇక్కడ ఏం చేస్తాడు.  తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయింది' అని వ్యాఖ్యానించారు.