బాబుపై మోత్కుపల్లి ఘాటు వ్యాఖ్యలు...

బాబుపై మోత్కుపల్లి ఘాటు వ్యాఖ్యలు...

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి నర్సింహులు... ఆలేరులో నిర్వహించిన ప్రజా వేదిక సభలో ఆవేశంగా మాట్లాడిన మోత్కుపల్లి... చేయని తప్పుకు నన్ను చంద్రబాబు బయటకు పంపాడంటూ కంటతడి పెట్టుకున్నారు. చంద్రబాబు బాబుపై ఈ సందర్భంగా తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ఆయన... వైఎస్ జగన్, పవన్ కల్యాణ్‌ అసలైన లీడర్లని తెలిపారు. అవసరం కోసం వాడుకొని వదిలేసే వ్యక్తుల్లో చంద్రబాబుని మించినోడు ఈ దేశంలోనే లేరంటూ విమర్శలు గుప్పించారు మోత్కుపల్లి. పేద ప్రజల సొమ్ము కాజేసి వంద కోట్లతో భవనం కట్టుకున్నాడని... విదేశాల్లో తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. 

ఎన్టీఆర్‌ని చంపి టీడీపీ జెండాని చంద్రబాబు దొంగలించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి... ఆ జెండా ఎన్టీఆర్ కుటుంబానికే దక్కాలన్నారాయన. ఇక ఓటుకు నోటుతో టీడీపీ పరువు తీశాడని మండిపడ్డ ఆయన... దొంగల్లా దొరికిన ఆ ఇద్దరికి శిక్ష పడాలన్నారు. ఓవైపు కేసీఆర్‌ని తిట్టమని చెబుతూ ఆయన కేసీఆర్‌ను కలుస్తాడు... మరి నేను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు మోత్కుపల్లి. మొన్నటి వరకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని తొట్టి... కర్ణాటకలో ఇద్దరికీ దండం పెట్టారంటూ ఆయన మండిపడ్డారు... కేసీఆర్, జగన్, పవన్ మొగోళ్లు... చంద్రబాబు దొంగ అంటూ ఘాటుగా స్పందించిన మోత్కుపల్లి... వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆంధ్ర ప్రజలు వంద పీట్ల లోపల బొంద పెడతారని వ్యాఖ్యానించారు.